యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట పట్టణ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ట్రాఫిక్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న రవిశంకర్ (PC4612) ఆత్మహత్య చేసుకున్నాడు. రవిశంకర్ స్వగ్రామం నల్లగొండ జిల్లా నార్కెట్ పల్లి శనివారం సాయంత్రం నల్గొండలోని ఒక ప్రైవేట్ లాడ్జిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు కుటుంబ తగాదాలు, ఆర్థిక ఇబ్బందులే కారణంగా తెలుస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.