
యాదాద్రి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం
యాదాద్రి భువనగిరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. చౌటుప్పల్ మండలం నేలపట్లలో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అవడంతో అధికారులు కోళ్ల ఫారాన్ని శనివారం పూర్తిగా శానిటైజ్ చేయించారు. ఆ ప్రాంతాన్ని నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు.