పిడుగు పడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన మహిళ
సూర్యాపేట జిల్లా చివ్వేంల మండల పరిధిలోని చందుపట్ల గ్రామానికి చెందిన కోడిరెక్క శోభ (38) రోజువారీగా వ్యవసాయం పనుల నిమిత్తం బావి వద్దకు వెళ్లగా శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా పిడుగుపడగా అపస్మారక స్థితిలోకి వెళ్లింది. స్థానికులు గమనించి హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు చెప్పారని భర్త కిరణ్ వెల్లడించాడు.