ఆకస్మిక తనిఖీ చేపట్టి ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ హెచ్చనిచ్చారు. శనివారం దేవరకొండలో ఉన్న సంక్షేమ వసతి గృహాలు, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల పనితీరుపై దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే వారి నివాసంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, కళాశాలల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు.