విద్యాభివృద్ధిలో బాబా కృషి అభినందనీయం

85చూసినవారు
కోదాడలోని 25వ వార్డులో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు సయ్యద్ బాబా అభినందనీయులని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి అన్నారు. సోమవారం వార్డులో పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యారంగ అభివృద్ధికి తోడ్పాటు అందించడం ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ సామినేని ప్రమీల, కౌన్సిలర్ మధార్, అలీ, గురవయ్య ఉన్నారు.

సంబంధిత పోస్ట్