కోదాడ టీడీపీ ఆధ్వర్యంలో మాజీ సిఎం చంద్రబాబు జన్మదినం

54చూసినవారు
కోదాడ టీడీపీ ఆధ్వర్యంలో మాజీ సిఎం చంద్రబాబు జన్మదినం
తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మ దినోత్సవం తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ముత్తినేని సైదేశ్వర రావు ఆధ్వర్యంలో శనివారం కోదాడలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు తిరిగి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అవుతారన్నారు. ఆయన నూరేళ్లు ఆనందంగా జీవించాలని రాష్ట్ర, దేశ రాజకీయాలను శాసించాలని ఆకాక్షించారు.