బ్యాంకాక్‌కు సముద్ర ముప్పు.. థాయ్‌లాండ్ రాజధాని మార్పు?

84చూసినవారు
బ్యాంకాక్‌కు సముద్ర ముప్పు.. థాయ్‌లాండ్ రాజధాని మార్పు?
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ జల ప్రళయం ముప్పును ఎదుర్కోనుందని ఆ దేశ పర్యావరణ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సముద్ర మట్టం పెరుగుతుండటంతో ఈ శతాబ్దం చివరికల్లా నగరం సముద్రగర్భంలో కలిసిపోయే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలోపే ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుని రాజధానిని మరోచోటికి తరలించాలని సూచిస్తున్నారు. బ్యాంకాక్‌ ఇప్పటికే ప్రతి వర్షాకాలంలో వరదలతో పోరాడుతుండటం గమనార్హం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్