డెంగీ కట్టడికి రూపొందించిన రెండో టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తెలిపింది. ఈ ఏడాది ఆసియా, లాటిన్
అమెరికా దేశాల్లో డెంగీ విజృంభణ పెరిగిన నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. జపాన్‌కు చెందిన ఔషధ సంస్థ తకెడా ఈ టీకాను అభివృద్ధి చేసింది. దీని పేరు క్యూడెంగా. 6- 16 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులకు దీన్ని ఇవ్వవచ్చని WHO సూచించింది.