అలిపిరి వద్ద ప్ర‌మాదం.. కారులో మంట‌లు

79చూసినవారు
తిరుపతి అలిపిరి వద్ద ప్రమాదం జరిగింది. ఓ కారులో మంటలు చెలరేగాయి. కారులో మంటలు ఎలా వ‌చ్చాయో తెలియాల్సి ఉంది. అయితే, మంటలు రాగానే అప్రమత్తమైన కారు డ్రైవర్.. ప్ర‌యాణికుల‌ను అప్ర‌మ‌త్తం చేశాడు. కారులో నుంచి దిగి భక్తులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘ‌ట‌న‌పై మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్