'ఉపాధి హామీ'లో ఏపీ ఫస్ట్, తెలంగాణ సెకండ్

71చూసినవారు
'ఉపాధి హామీ'లో ఏపీ ఫస్ట్, తెలంగాణ సెకండ్
జాతీయ ఉపాధి హామీ పథకంలో దేశంలోనే మొదటిస్థానంలో ఏపీ ఉన్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పేర్కొంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు 6.99 కోట్ల పనిదినాలను ఏపీ ప్రభుత్వం కల్పించింది. మొత్తం 32.37 లక్షల కుటుంబాలు రూ.1,713.27 కోట్ల మేర లబ్ధి పొందాయి. కాగా 45 రోజుల్లో 4.49 కోట్ల పనిదినాలు కల్పించి తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. ఇక తర్వాతి మూడు స్థానాల్లో ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, బిహార్ ఉన్నాయి.

సంబంధిత పోస్ట్