మహాత్మా గాంధీ ఆశయాలను సాధించాలని కోదాడ ఎంపీడీవో పాండు రంగన్న అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గాంధీ సిద్ధాంతాలను పాటించడమే ఆయనకు మనం ఇచ్చే ఘన నివాళులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ శ్రీరాములు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.