దీర్ఘకాలిక రుణాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

61చూసినవారు
దీర్ఘకాలిక రుణాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
రైతుల ప్రయోజనాలే సహకార సంఘ లక్ష్యమని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి అన్నారు. సోమవారం కోదాడ సొసైటీ లో రైతులకు దీర్ఘకాలిక రుణాలను పంపిణీ చేసి మాట్లాడారు. కోదాడ సొసైటీ అభివృద్ధికి పాలకవర్గం చేస్తున్న కృషిని ఆమె అభినందించారు. సొసైటీ ఛైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ 15 మంది సభ్యులకు దీర్ఘకాలిక రుణాల్లో భాగంగా 45 లక్షల రూపాయలు అందించినట్లు తెలిపారు. కార్యక్రమం లో వైస్ చైర్మన్ నరేష్ సభ్యులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్