పోలీసుల కనుసన్నలతోనే కేటీఆర్ పై దాడి జరిగింది: జగదీష్ రెడ్డి

66చూసినవారు
పోలీసుల కనుసన్నలతోనే కేటీఆర్ పై దాడి జరిగింది: జగదీష్ రెడ్డి
తెలంగాణ భవన్ లో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మంగళవారం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూసీ పరివాహక ప్రాంతాల బాధితులను కలిసేందుకు వెళ్లిన కేటీఆర్ కాన్వాయ్ పై దాడి హేయమైన చర్య అన్నారు. పోలీసుల కనుసన్నల్లోనే పథకం ప్రకారం దాడి జరిగిందని అన్నారు. ట్రాఫిక్ సిగ్నల్ ను ఆపి కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసేందుకు పోలీసులు సహకరించారని తెలిపారు.

సంబంధిత పోస్ట్