ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట టీఎస్ యుటిఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన డిఏ లను వెంటనే ప్రకటించాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ రాములు, జిల్లా అధ్యక్షులు సోమయ్య ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు పి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.