హైదరాబాదులో విద్యుదాఘాతంతో తుంగతుర్తి మండలం దేవుని గుట్ట తండా గ్రామానికి చెందిన గుగులోతు మల్లేష్ (25) దుర్మరణం చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం హబ్సిగూడకు చెందిన టి. రవి సైంటిస్ట్ కాలనీలోని వరలక్ష్మి ఆర్కేడ్ లోని నాలుగో అంతస్తుపై ఉన్న భారీ ప్రకటన బోర్డును తొలగించేందుకు ఇద్దరు కూలీలను పిలిచారు. ఈ ప్రమాదంలో మహబూ బాబాద్ జిల్లా కేసముద్రంకి చెందిన బాలు(36) మృతి చెందాడు.