సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల వ్యాప్తంగా చలి తీవ్రతతో పాటు పొగ మంచు ఎక్కువైంది. జాతీయ రహదారి 365 పై దట్టమైన పొగ మంచు కొమ్ముకోవడంతో ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత రెండు మూడు రోజుల నుంచి రోజు రోజుకు చలి తీవ్రత అధికమవుతుంది. రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు ప్రయాణికులు జాగ్రత్త వహించాలని అధికారులు సూచిస్తున్నారు.