T20WC: భారత్-పాక్ మ్యాచ్‌కు వర్షం ముప్పు

81చూసినవారు
T20WC: భారత్-పాక్ మ్యాచ్‌కు వర్షం ముప్పు
టీ20 వరల్డ్ కప్‌లో భారత్-పాక్ మ్యాచ్‌ గురించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు బ్యాడ్ న్యూస్. ప్రస్తుతం మ్యాచ్ జరగనున్న న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వద్ద ఆకాశం మేఘావృతమై కనిపిస్తోంది. accuweather ప్రకారం వర్షం పడే అవకాశాలు శనివారం ఉదయం 11 గంటలకు 43 శాతం ఉండగా, ప్రస్తుతం అది 51 శాతానికి పెరిగింది. వర్షం వల్ల ఆటకు అంతరాయం ఏర్పడే అవకాశమున్నట్లు తెలుస్తోంది.