రష్యా-ఉక్రెయిన్ వివాదం, నా ఉక్రెయిన్ పర్యటన గురించి పుతిన్ తో మాట్లాడాను: ప్రధాని మోదీ

57చూసినవారు
రష్యా-ఉక్రెయిన్ వివాదం, నా ఉక్రెయిన్ పర్యటన గురించి పుతిన్ తో మాట్లాడాను: ప్రధాని మోదీ
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఫోన్‌లో మాట్లాడారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి, తన ఉక్రెయిన్ పర్యటన గురించి పుతిన్ తో మాట్లాడినట్లు మోదీ తెలిపారు. 'ఉక్రెయిన్-రష్యా వివాదం సత్వర పరిష్కారానికి, శాంతి-సుస్థిరతలు నెలకొనేందుకు భారత్ పూర్తి మద్దతు అందిస్తుందని పునరుద్ఘాటించాను' అని మోదీ తెలిపారు. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్