TG: త్వరలోనే రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు నగారా మోగనుంది. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీ.. షెడ్యూల్ వచ్చే నాటికే గ్రౌండ్ క్లియర్ గా ఉండాలని భావిస్తోంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా రుణమాఫీతో పాటు రైతు భరోసా వంటివి వాటిని అస్త్రాలుగా వాడనుంది. అంతేకాకుండా రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తున్నామని, కొత్త రేషన్ కార్డుల జారీని ప్రచారం చేయనున్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్, ఫ్రీ బస్సు పథకం, ఉచిత విద్యుత్ వంటి వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ఎన్నికల్లోసత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తోంది.