ఆసియా క్రీడలకు తెలంగాణ గ్రాండ్‌మాస్టర్

638చూసినవారు
ఆసియా క్రీడలకు తెలంగాణ గ్రాండ్‌మాస్టర్
చైనా వేదికగా జరుగనున్న ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలకు తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగైసి ఎంపికయ్యాడు. సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగాటోర్నీ కోసం అఖిల భారత చెస్ సమాఖ్య 10 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఇందులో అర్జున్‌కు చోటు దక్కింది. పురుషుల విభాగంలో విదిత్ గుజరాతి, గుకేశ్, ప్రజ్ఞానంద, హరికృష్ణ తలపడనున్నారు. మహిళల విభాగంలో ఆసియా స్వర్ణ పతక విజేత కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక పోటీ పడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్