సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత ఈ వీడియో మీ కోసమే అంటూ వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా సంచలన పోస్టు పెట్టారు. బెల్ట్ షాపులో మైనర్ బాలుడు పని చేస్తున్న వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు. ‘ఇదిగోండి.. ఇదెక్కడో కాదు. టీడీపీ మేధావి యనమమల రామకృష్ణుడు సొంత మండలం. మైనర్ బాలుడిని పెట్టి బెల్టు షాపు నడిపిస్తున్నారు. బెల్టు షాపు కనిపిస్తే బెల్టు తీస్తానన్న సీఎం.. నన్ను బెల్టు షాపు ఎక్కడుందో చూపించమన్న హోంమంత్రి.. మీ కోసమే ఈ వీడియో.’ అంటూ రోజా పోస్టులో రాసుకొచ్చారు.