IED బాంబు పేల్చిన ఉగ్రవాదులు.. ఏడుగురు మృతి

55చూసినవారు
IED బాంబు పేల్చిన ఉగ్రవాదులు.. ఏడుగురు మృతి
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఉగ్రవాదులు రిమోట్ కంట్రోల్డ్ ఐఈడీ బాంబును పేల్చడంతో ఏడుగురు చనిపోయారు. మృతుల్లో ఐదుగురు పాఠశాల విద్యార్థులు, ఒక పోలీసు, మరో వ్యక్తి ఉన్నారు. మరో 17 మంది గాయపడ్డారు. ముస్తాంగ్ జిల్లాలోని సివిల్ హాస్పిటల్ చౌక్ వద్ద పోలీసు వ్యాన్ లక్ష్యంగా దాడి జరిగింది. ఆగి ఉన్న బైక్‌లో బాంబులు పెట్టి రిమోట్‌ కంట్రోల్‌తో పేల్చినట్లు ముస్తాంగ్ డీపీఓ ఉమ్రానీ తెలిపారు.

సంబంధిత పోస్ట్