రేపు సీఆర్డీఏ 44వ అథారిటీ స‌మావేశం

68చూసినవారు
రేపు సీఆర్డీఏ 44వ అథారిటీ స‌మావేశం
సోమవారం ఉద‌యం 11 గంట‌ల‌కు సీఆర్డీఏ 44వ అథారిటీ స‌మావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షత‌న జ‌రిగే స‌మావేశానికి మంత్రి నారాయ‌ణ‌, ఉన్నతాధికారులు హాజ‌రుకానున్నారు. ఎల్పీఎస్ జోన్ 7, జోన్ -10లో మౌళిక వ‌సతుల క‌ల్పన‌కు అథారిటీ ఆమోదం తెల‌ప‌నుంది. ఇప్పటివ‌ర‌కూ రూ.45,249.24 కోట్ల విలువైన ప‌నులు చేప‌ట్టేందుకు అథారిటీ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. మ‌రో రూ.2,000 కోట్ల పైబ‌డి ప‌నులు చేప‌ట్టేందుకు అథారిటీ ఆమోదం తెల‌ప‌నుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్