TG: హైదరాబాద్ శివారులోని బాలాపూర్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం అర్థరాత్రి ఓ ప్లాస్టిక్ గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడతుండటంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో అగ్ని మాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు.