తెలంగాణలో మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఇందిరా మహిళా శక్తి ముఖ్య ఉద్దేశమని మంత్రి సీతక్క అన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి మహిళను స్వయం సహాయక సంఘాల్లో చేర్పించాలని చెప్పారు. డిసెంబర్ మొదటి వారంలో మహిళా శక్తి వారోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. బ్యాంకుల నుంచి వడ్డీ లేని రుణాలను మహిళా సంఘాలకు ఇప్పించేలా ప్రత్యేక డ్రైవ్ చేపడతామన్నారు.