తెలంగాణ 2024 డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం బుధవారం నియామక పత్రాలు అందజేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నియామక పత్రాలను అందుకోనున్న అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ళ తరబడి టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూసిన తమకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక న్యాయం జరిగిందంటున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. 'థాంక్యూ సీఎం సార్' అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.