MI తమ కీలక ప్లేయర్లను ఫ్రాంచైజీలో కొనసాగించింది. బుమ్రాకు రూ.18 కోట్లు, సూర్య, హార్దిక్‌కు రూ.16.35 కోట్లు చొప్పున వెచ్చించింది. రోహిత్ శర్మను రూ.16.30 కోట్లకు రిటైన్ చేసుకున్నారు. కాగా, తన రిటైన్ ధరపై రోహిత్ శర్మ స్పందించాడు. టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన తనకి ఈ ధర సరైనదే అని అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగే బుమ్రా, హార్దిక్, సూర్యకే అత్యధిక ధర ఉండటం సబబేనని అన్నాడు.