నటి సనమ్ శెట్టి తమిళ చిత్రపరిశ్రమపై సంచలన ఆరోపణలు చేసారు. అక్కడ పని సంస్కృతి గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టారు. తమిళ ఇండస్ట్రీలో లింగ వివక్ష ఉందని ఎత్తి చూపారు. సమానత్వం గురించి సినిమాలు తీసేముందు ముందు నటీనటులను సమానంగా గౌరవించాలని చిత్రనిర్మాతలపై విమర్శలు చేశారు. పురుష నటులను గౌరవంగా చూస్తారు. కానీ మహిళ నటులను అదే విధంగా చూడరని ఆవేదన వ్యక్తం చేశారు.