ఏడో తరగతి విద్యార్థి ఆత్మహత్య... పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య... ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య... ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థిని మృతి తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల చోటుచేసుకున్న కొన్ని ఘటనలు. ఓ ప్రముఖ విద్యా సంస్థకు చెందిన ప్రైవేట్ కాలేజీలు, హాస్టళ్లలో విద్యార్థులు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలూ చూస్తున్నాం. ఏదో సంచలనం జరిగితే తప్ప.. విద్యార్థుల ఆత్మహత్యలను ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదు.