చదువులో ఒత్తిడి తట్టుకోలేకనో, ఉపాధ్యాయులు వేధించారనో, ఫీజు కట్టలేదనో, తల్లిదండ్రులు మందలించారనో, వారు కావాలనుకున్నది ఇవ్వలేదనో, పరీక్షల్లో మంచి మార్కులు రాలేదనో, ప్రేమించిన వారు మోసం చేసారనో విద్యార్థులు మనస్తాపానికిగురై బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో గత కొంతకాలంగా తీవ్రస్థాయిలో ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే వాటి కట్టడికి ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు శూన్యం.