విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రధాన కారణం ఒత్తిడి. ఒకప్పుడు సర్కారీ బడుల్లో 9వ తరగతి వరకు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆటపాటల మధ్య బాల్యం గడిచేది. ఇప్పుడు పిల్లల్ని ఎల్‌కేజీలో చేర్పించడానికే పేరెంట్స్ లక్షలు ఖర్చుపెడుతున్నారు. నాలుగో క్లాస్ నుంచే ఐఐటీ ఫౌండేషన్ ప్రోగ్రాం అంటూ స్కూళ్లు వారిని రుద్దేస్తున్నాయి. దీంతో ఆటపాటలేమీ లేకుండా.. నాలుగు గోడల మధ్య, బండెడు పుస్తకాలతో బాల్యం నలిగిపోతోంది.