తన కంపెనీలో ఉద్యోగం నుంచి లేఆఫ్ కు గురైన ఉద్యోగి అమెరికా వీసా ఉన్న తన పాస్‌పోర్ట్‌ను దొంగిలించాడని బెంగళూరుకు చెందిన సదరు స్టార్టప్ సార్థి ఏఐ సీఈవో విశ్వనాథ్ ఝా అన్నారు. దీంతో స్టార్టప్ నిధులు సేకరించేందుకు విదేశాలకు వెళ్లే అవకాశం లేకుండా పోయిందని చెప్పారు. “నేను ఇప్పుడు కొత్త పాస్‌పోర్ట్ తీసుకున్నాను. కానీ నాకు ఇంకా అమెరికా వీసా రాలేదు” అని విశ్వనాథ్ తెలిపారు.