కండక్టర్ పై చేయి చేసుకున్న ప్రయాణికుడు.. వీడియో వైరల్

70చూసినవారు
బస్సులలో కండక్టర్ లకు, ప్రయాణికులకు మధ్య గొడవలు జరిగిన ఘటనలు తరచూ వార్తల్లో చూస్తూ ఉంటాం. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. యూపిఎస్ఆర్టీసీకి చెందిన ఓ బస్సు కండక్టర్ పై ప్రయాణికుడు చేయి చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో సదరు ప్రయాణికుడు కండక్టర్ చొక్కా పట్టి లాగి అతడిపై దాడి చేశాడు. దుర్భాషలాడుతూ బెదిరించాడు. అయితే టికెట్ విషయమై ఈ గొడవ తలెత్తినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్