క్షణికావేశంలో తల్లిన చంపిన కొడుకు

79చూసినవారు
క్షణికావేశంలో తల్లిన చంపిన కొడుకు
కుమారుడు క్షణికావేశంలో తల్లిని కొట్టడంతో మృతి చెందిన సంఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కొప్పులలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన మోతె తిరుపతిరెడ్డి ఓ విషయంలో పక్కింటి వారితో గొడవ పడ్డాడు. భార్య నాగరాణి ఆయనను వారించి ఇంట్లోకి తీసుకెళ్లగా భార్యను కొట్టాడు. దీంతో ఆయన తల్లి అమృతమ్మ(85) అడ్డుకునేందుకు ప్రయత్నించగా పక్కనే ఉన్న మంచం పట్టెతో కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్