సినిమా వాచకుడిగా పనిచేసిన గుర్రం జాషువా

78చూసినవారు
సినిమా వాచకుడిగా పనిచేసిన గుర్రం జాషువా
గుర్రం జాషువా 1910లో మేరీని పెళ్లి చేసుకున్నాడు. మిషనరీ పాఠశాలలో నెలకు రూ.3 జీతంతో ఉద్యోగంలో చేరాడు. ఆ ఉద్యోగం పోవడంతో రాజమండ్రి వెళ్లి 1916లో అక్కడ సినిమా వాచకుడిగా పని చేశారు. టాకీ సినిమాలు లేని ఆ రోజుల్లో తెరపై జరుగుతున్న కథకు అనుగుణంగా నేపథ్యంలో కథ, సంభాషణలు చదువుతూ పోవడమే ఈ పని. తర్వాత గుంటూరులోని లూథరిన్ చర్చి నడుపుతున్న ఉపాధ్యాయ శిక్షణాలయంలో టీచర్‌గా పదేళ్లపాటు పని చేశాడు. అనంతరం 1942 వరకు గుంటూరులోనే ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా ఉన్నారు.

సంబంధిత పోస్ట్