విషాదంగా మారిన సుష్మితా కథ

505092చూసినవారు
విషాదంగా మారిన సుష్మితా కథ
నా పేరు అంజి (పేరు మార్పు) నేను ఇంటర్ పూర్తి చేసి ఆవారాగా తిరుగుతున్నాను. ఆ సమయంలో అనుకోకుండా సుష్మిత (పేరు మార్పు) కనపడింది. సుష్మిత చాలా అందంగా ఉండేది. తెలివైన అమ్మాయి. రోజు సుష్మిత వెనకాలే తిరుగుతూ ఉండేవాన్ని. చూసి చూడనట్లుగా ఉండే సుష్మిత ఒక రోజు గట్టిగా నిలదీసింది ఎందుకురా నా వెంట తిరుగుతున్నావు అని అడిగింది. నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పాను. మొదటి సారి ప్రేమిస్తున్నాను అని ఒక అబ్బాయి చెప్పేసరికి ఆనందం పట్టలేకపోయింది సుష్మిత. సిగ్గుపడి వెళ్ళిపోయింది. నేను రోజు రకరకాల డ్రెస్సులు వేసుకొని సుష్మిత కంట పడేవాన్ని. సుష్మిత రోజు చూసేది ఆనంద పడేది. నేను అంటే చాలా ప్రేమ అభిమానాలు పెంచుకుంది. సుష్మిత ఇంజనీరింగ్ చదువుతోంది. ఇలా రోజు నేను తిరుగుతూ ఉండటం చదువుకోకుండా పనిచేయకుండ తిరుగుతున్నానని ఇరుగుపొరుగు నోట పడి సుష్మితాకు చేరింది.

అంతే సుష్మితా నన్ను నిలదీసింది. ఏం చేస్తావు నువ్వు ఏం చదివావు వివరాలు అడిగింది. నేను అన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పాను. చదువులో ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నానని సుష్మితా గ్రహించింది. ఎందుకు ఇతనిని నేను పెళ్లి చేసుకోవడం నా కన్నా తక్కువ చదివాడు అంతేకాకుండా పని చేసే ఉద్దేశం లేదని తాను మనస్సులో అనుకుంది. నన్ను పెళ్లి చేసుకుంటే కష్టాలు తప్పవు అనుకుంది. మనసులో మాట బయట పెట్టింది. నాకు మొహం మీదే చెప్పింది. నువ్వంటే నాకు ఇష్టం లేదు అని.

సుష్మితా వెంటనే వాళ్ళ అమ్మకు నన్ను ఒక్కడు నా వెంట పడి విసిగిస్తున్నాడని చెప్పింది. సుష్మితా వాల్ల అమ్మ ఆగ్రహించి నన్ను చెడా మడా తిట్టింది. అంతే కాకుండా నా మొహం అద్దం లో చూసుకో నా కూతురు ఇంజనీరింగ్ చదువుతోంది. నా కూతురు వెంట పడకు జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చింది. నేను ఆమె మాట వినకుండా అలానే సుష్మితా వెనకాల తిరుగుతూ ఉండేవాన్ని. మాట్లాడక పోతుందా అని ఆశతో ఎదురు చూస్తూ కాలం వెలిబుచ్చాను. కానీ రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. సుష్మితాలో ఎలాంటి మార్పు లేదు.

నేను ఇక లాభం లేదని ఒక రోజు లవ్ లెటర్ రాసి సుష్మితా ఇవ్వాలని ప్రయత్నం చేశాను. సుష్మితా వెంటనే వాళ్ళమ్మకు చెప్పింది. ఆగ్రహించిన సుష్మితా అమ్మ నన్ను చొక్కా పట్టుకుని కొట్టడమే కాకుండా తీవ్రంగా అవమానించి సుష్మితా అమ్మ సుష్మితా చెప్పుతో కొట్టే విధంగా ప్రేరేపించింది. తీవ్రంగా దెబ్బలు తిన్న నేను మనసు గాయపడి తేరుకునేలోపే ఇంటిలో జరిగిన విషయం నా తల్లిదండ్రులకు తెలిసిపోయింది వాళ్ళు ఆగ్రహించారు. నన్ను తీవ్రంగా తిట్టారు. అవమాన పరిచారు.

నేను మనస్థాపం చెందాను. ఎందుకు ఈ బతుకు అని మనో వేదన చెందాను. వెంటనే చనిపోవాలని నిర్ణయంతో నిద్రమాత్రలు తెచ్చుకొని మింగాను. అవి వికటించడంతో ప్రాణాపాయం నుంచి బయట పడ్డాను. కానీ వారి తల్లిదండ్రుల నుంచి మళ్లీ అవమానాలు ఎదుర్కొన్నాను. చావకుండా బతికాడు అని ఎగతాళి చేశారు.

నేను మనస్థాపంతో ఇల్లు వదిలాను. ఫ్రెండ్స్ తో కలిసి ఒక పెద్ద నగరంలో పని చేసుకోవడానికి ఒక చిన్న రూములో నివాసముంటూ హోటల్లో పని చేసుకుంటూ జీవనం సాగించాను. ఫిజికల్ గా ఎంతో యాక్టివ్ గా ఉండే నేను ఇంటర్ మీద ఆర్మీ ఉద్యోగానికి అప్లై చేశాను. నిరంతరం శ్రమించాను. నా కృషి, శ్రమ వల్ల ఆర్మీ లో సెలెక్ట్ అయ్యాను. నా పరిస్థితి మారిపోయింది. ఆర్మీ ఉద్యోగిగా స్థిరపడ్డాను. కానీ అంతకు ముందు అవసరం వచ్చినప్పుడల్లా ఊరికి వెళితే అమ్మానాన్నలతో అవమానాలు ఎదురయ్యాయి. ప్రేమించిన అమ్మాయి దూరమైన బాధకన్నా అమ్మనాన్నలు మాట్లాడిన మాటలే నాకు ఎక్కువగా బాధ కలిగించాయి.

అయితే ఈ సారి నాకు ఉద్యోగం వచ్చిన తరువాత మళ్ళీ ఊరిలో కి వచ్చాను. సెలవుల మీద ఈసారి గొప్పగా ఆర్మీ ఆఫీసర్ గా వచ్చాను. నా తల్లి తండ్రులు కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు అని ఆనందపడ్డారు. కానీ నేను కోల్పోయిన ఆనందాన్ని తల్లిదండ్రుల నుంచి లభించే ప్రేమను కోల్పోయానని అప్పటివరకు గ్రహించలేకపోయారు. నేను రోజు దిగాలుగా ఉండటం చూసి వాళ్ళు బాధ పడ్డారు. కంటనీరు పెట్టుకున్నారు. నీకేమైనా మా వంతుగా సహాయం చేయగలము. ఏమైనా చేయవలసిన పనులు ఉంటే చెప్పమని అడిగారు. సుష్మితా అంటే చాలా ఇష్టం అని నాన్న అమ్మ కు చెప్పాను.

పెళ్లి చేసుకుంటావా అని అడిగారు. నేను చేసుకుంటానని చెప్పడంతో సంబంధం మాట్లాడడానికి నా తల్లిదండ్రులు వెళ్లారు. కానీ అప్పటికే సుష్మితా కు పెళ్లి అయిపోయింది ఇద్దరు పిల్లలున్నారని తెలుసుకున్నారు. దీంతో వారు వెను తిరిగి వచ్చారు. నాన్న ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయిందట. ఇద్దరు పిల్లలు అంట. అమ్మాయి హ్యాపీగా ఉంది. నీకు వేరే పెళ్లి చేస్తాము ఇష్టమే కదా అని అడిగారు.

బాధతో నేను మాట్లాడలేకపోయినా కాలయాపన తో సుష్మితాను కోల్పోయానని గ్రహించాను. బాధను దిగమింగి చేసేదేమీ లేక మీ ఇష్టం అని చెప్పాను. కొంతకాలానికి వేరే అమ్మాయితో నాకు పెళ్లి చేశారు. కానీ నేను చేసిన వృథా కాలయాపన వల్ల నేను ప్రేమించిన అమ్మాయిని కోల్పోయాను అని గ్రహించాను.


కొద్దిరోజుల తర్వాత సుష్మితా భర్త యాక్సిడెంట్ లో మృతి చెందాడు అని తెలుసుకున్నాను. అంతే కాదు సుష్మితా చదువు మధ్యలోనే ఆగిపోయిందని తెలుసుకున్నాను. ప్రస్తుతం ఆమె జీవితం ప్రశ్నార్థకం.అందుకే కాలయాపన చేయకుండా వెంటనే నిర్ణయం తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. నేను ఇప్పుడు ఏం చేయలేని స్థితిలో ఉన్నాను.


"చెప్పాలని ఉంది"

చాలా మందికి ప్రేమ ఓ మధుర జ్ఞాపకం. కొందరికి ఆ ప్రేమ సంతోషాన్నిస్తే మరికొందరికి జ్ఞాపకంగా మిగులుతుంది. లవ్ ఫెయిల్యూర్ అయినా... జీవితంలో విజయం సాధించిన వారు ఎందరో.. అటువంటి జ్ఞాపకాలను లోకల్ యాప్... “చెప్పాలని ఉంది” లో షేర్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. లవ్ ఫెయిల్యూర్ అయినా.. సక్సెస్ అయినా మీరు మీ కథను పంపవచ్చు. మీరు పంపిన మీ కథను ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రచురిస్తాం. మీరు మీ కథను content@getlokalapp.com కు మెయిల్ చేయాలి.

గమనిక.. వారానికి ఒక కథను మాత్రమే ప్రచురిస్తాం. దీనిని లోకల్ యాప్ ట్రెండింగ్ కేటగిరిలో చూసుకోవచ్చు.

ఈ కథనం పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.