అస‌లు విష‌యం ఇదా.. ఎన్టీఆర్ విరాళం ఎందుకు ఇచ్చాడంటే..!

595చూసినవారు
అస‌లు విష‌యం ఇదా.. ఎన్టీఆర్ విరాళం ఎందుకు ఇచ్చాడంటే..!
కోనసీమలోని జగ్గన్నపేటలో వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధి పనుల కోసం జూనియర్ ఎన్టీఆర్ రూ.12.50 లక్షల విరాళం ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఎందుకు అంత విరాళం ఇచ్చానే చర్చ సోష‌ల్ మీడియాలో మొద‌లైంది. అయితే ఈ చ‌ర్చ‌లో ఓ ఇంట్రెస్టింగ్ విష‌యం బ‌య‌టికొచ్చింది. అక్కడ పనిచేసే పురోహితుడు కారుపాటి కోటేశ్వరరావు తార‌క్ పెళ్లి చేసిన‌ట్లు స‌మాచారం. ఆయన కోరిక మేర‌కే విరాళం ఇచ్చారని తెలుస్తోంది. అంతేకాకుండా ఎన్టీఆర్‌ తల్లి షాలిని, సోదరుడు కల్యాణ్ రామ్ తరుచూ ఆ ఆలయాన్ని సందర్శిస్తార‌ట‌.

సంబంధిత పోస్ట్