సంక్రాంతి రోజైన ఇవాళ సూర్యుడు ధనస్సు రాశిని వీడి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇవాళ మకర సంక్రమణ ప్రారంభమవుతుంది. దీంతో దక్షిణాయణం పూర్తయి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. సూర్యుడు పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తుంటాయి. సూర్యుడు సంవత్సరంలో ఆరు నెలలు ఒక వైపు అనగా దక్షిణం వైపు, మరో ఆరు నెలలు ఉత్తరం వైపు పయనిస్తూ ఉంటాడు. ఇవాళ సూర్యుడిని ఆరాధిస్తే మంచి జరుగుతుందని నమ్మకం. ఉత్తరాయణంలో చలి తీవ్రత తగ్గుముఖం పడుతుంది.