కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక ప్రకటన చేశారు. ఢిల్లీ ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. తన ప్రాణాలున్నంత వరకు భారతదేశంలో అణచివేతకు గురయ్యే పౌరుల రక్షణ కోసం కుల మతాలకు అతీతంగా పోరాడతానని పేర్కొన్నారు. దేశంలోని ప్రజల మధ్య ద్వేషం లేకపోవడమే నిజమైన భారత్‌కు అర్థమని చెప్పారు. ద్వేషాన్ని బీజేపీ వ్యాప్తి చేస్తోందని, ప్రేమ మాత్రమే ద్వేషాన్ని ఓడించగలదని వ్యాఖ్యానించారు.