ఏపీలో భోగి రోజు ఘోర ప్రమాదాలు

61చూసినవారు
ఏపీలో భోగి రోజు ఘోర ప్రమాదాలు
ఏపీలో భోగి పండుగ రోజు ఘోర ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. తిరుమలలో లడ్డూ కౌంటర్ల వద్ద షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం సంభవించింది. తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. తిరుపతి జిల్లా కళ్యాణి డ్యామ్ దగ్గర రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. తిరుపతిలో నిర్వహించిన జల్లికట్టులో ఒకరు మృతి చెందగా.. ఆరుగురు గాయపడ్డారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్