యూపీలోని జౌన్‌పూర్ జిల్లాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. పవారా పోలీస్ స్టేషన్ పరిధి రాంపూర్ సవాయి గ్రామంలో వితంతువు ఇంటికి ఓ యువకుడు వెళ్లాడు. ఆమె అతడికి మేనత్త అవుతుంది. వీరిని గ్రామస్థులు చూశారు. యువకుడిని స్తంభానికి కట్టేశారు. అనంతరం వితంతువుతో బలవంతంగా పెళ్లి చేశారు. ఆమెకు ఆ యువకుడు నుదుటన సింధూరం దిద్దారు. దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.