నా భర్తపై కుట్ర జరుగుతోంది: ఆదిమూలం భార్య

57చూసినవారు
నా భర్తపై కుట్ర జరుగుతోంది: ఆదిమూలం భార్య
తన భర్త ఆదిమూలంపై కుట్ర జరిగిందని ఆయన భార్య గోవిందమ్మ అన్నారు. మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపణలతో సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం పార్టీ నుంచి సస్సెన్షన్ అయిన విషయం తెలిసిందే. అయితే తన భర్త చాలా మంచివాడని ఆమె తెలిపారు. ఆదిమూలం తప్పు చేయరని, నియోజకవర్గంలో ఆయన ఎలాంటి వారో అందరికి తెలుసన్నారు. రెండవ సారి ఎమ్మెల్యేగా గెలవడం జీర్ణించుకోలేని కొందరు ఇలా కుట్ర చేశారని ఆదిమూలం భార్య గోవిందమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్