మెట్రో ప్రయాణ వేళల్లో మార్పు లేదు

59చూసినవారు
మెట్రో ప్రయాణ వేళల్లో మార్పు లేదు
మెట్రో ప్రయాణ వేళల్లో మార్పులు చేశారంటూ జరుగుతున్న ప్రచారాన్ని హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు ఖండించారు. మెట్రో రాకపోకల్లో ఎలాంటి మార్పు చేయలేదని, యథావిధిగానే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రైళ్లు నడుస్తాయన్నారు. ప్రతి శుక్రవారం రాత్రి 11.45 గంటల వరకు, ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటల నుంచే రైళ్ల రాకపోకలపై పరిశీలన మాత్రమే జరిగిందని, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు.

ట్యాగ్స్ :