2023లో ప్రకాశించే 3 రాశులు ఇవే

4541చూసినవారు
2023లో ప్రకాశించే 3 రాశులు ఇవే
కొత్త సంవత్సరంలో కొత్త లక్ష్యాలు సాధించాలని చాలా మంది భావిస్తారు. ఏదైనా మంచి పని ప్రారంభించే ముందు రాశిచక్రాల ఫలాలు మనకు అనుకూలమా, ప్రతికూలమా అనే విషయాలు తెలుసుకోవాలి. ప్రముఖ జ్యోతిష్యులు 2023లో ప్రకాశవంతమైన 3 రాశులు ఉన్నాయని వివరించారు. వాటి గురించి తెలుసుకుందాం.
మేషరాశి: అప్పులు తీరి, ఆర్థిక స్థిరత్వం రావాలంటే ఏడాది సమయం పట్టొచ్చు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటారు. మీరు ఒంటరిగా ఉండి, సరైన తోడు కోసం వెతుకుతున్నట్లైతే మీరు కోరుకుంటున్న భాగస్వామి మిమ్మల్ని చేరే అవకాశం ఉంది. ఆదాయ పరిస్థితి బాగుంటుంది. మే లోపు చక్కటి కొలువు వస్తుంది. మీ సంపాదనను పొదుపు చేయడం మంచిది. ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలి. వృత్తి-కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి.
వృషభం: సంత్సరం మొదటి అర్ధభాగం నిరుత్సాహాలు ఎదురవుతాయి. దేనికైనా వేచి చూడాలి. అపార్థాలు విడనాడాలి. వైవాహిక భాగస్వామితో హృదయపూర్వక సంభాషణ ఉండాలి. ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశం ఉంటుంది. జులై తర్వాతే కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించండి. డబ్బును పొదుపు చేసుకోవాలి. అనవసర ఖర్చులు మానుకోవాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలి.
మిథునం: వృత్తి, ఉద్యోగ, వ్యక్తిగత రంగాలలో ఈ ఏడాది ఆశాజనకంగా ఉంటుంది. పని ఒత్తిడిలో పడి కుటుంబాన్ని మరువకూడదు. తోడు ఉంటే వారితో విహార యాత్రకు వెళ్లడం మంచింది. సరైన తోడు కోసం చూస్తుంటే మీకు చక్కటి భాగస్వామి దొరికే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఓపిక పట్టాలి. మంచి రోజులు వస్తాయి. అప్పులు తీర్చేయండి. పెట్టుబడులు పెట్టొద్దు. కోపం తక్కువ ఉండాలి.
కర్కాటకం: జీవితంలో మార్పులు ఏ రూపంలో అయినా రావొచ్చు. వాటికి భయపడొద్దు. అనుకున్నది సాధించగలరు. మీ ప్రేయసి/ప్రియుడికి దూరంగా ఉన్నా, ఆ దూరమే మీ ప్రేమను మరింత పెంచుతుంది. తల్లిదండ్రుల వల్ల కొందరికి పెళ్లి ఆలస్యం కావొచ్చు. పెళ్లైన వారు జీవిత భాగస్వామి కోసం సమయం కేటాయించాలి. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. పెట్టుబడులు ఈ ఏడాది లాభాలు తీసుకొస్తాయి. ధ్యానం ద్వారా ప్రశాంతతతో పాటు ఆరోగ్యం బాగుంటుంది.
సింహ: ఈ సంవత్సరం మీ సత్తా చాటే సమయం. మీ ప్రతిభను ప్రదర్శించాల్సిన చోట వెనుకడుగు వేయొద్దు. వృత్తి, ఉద్యోగాలలో ముందంజ వేస్తారు. భాగస్వామి కోసం ఓపికతో వేచి చూడండి. పెళ్లైన వారు తమ భాగస్వామిని నిర్లక్ష్యం చేయొద్దు. విద్యార్థులకు, క్రీడాకారులకు కలిసి వస్తుంది. ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. వాహనయోగం ఉంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం.
కన్య: కొత్త ఉద్యోగ అవకాశాలు మీ కోసం సిద్ధంగా ఉంటాయి. ఊహించని వారి నుంచి ప్రేమను పొందుతారు. ఈ ఏడాదిలో మూడో త్రైమాసికం వరకు ఉద్యోగం మారొద్దు. అప్పటి వరకు వేచి చూడండి. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టు ప్రమాదం ఉంది. డబ్బు ఖర్చు చేసే విషయంలో జాగ్రత్తలు ఉండాలి. ఆరోగ్యం బాగుంటుంది.
తుల: మిశ్రమ ఫలితం ఉంటుంది. కొన్ని పొందితే మరికొన్ని కోల్పోవచ్చు. తప్పనిసరి ఖర్చులు ఉంటాయి. అయితే ఆర్థికంగా మంచి స్థితిలో ఉంటారు. సొంత కారు లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. అవివాహితులకు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఈ ఏడాది అన్ని పనులు సవ్యంగా సాగుతాయి. పెళ్లైన వారు తమ జీవిత భాగస్వామితో సఖ్యతతో ఉండాలి. శారీరక, మానసిక ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలి.
వృశ్చికం: ఏడాది ప్రథమార్థంలో ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఊహించని విజయాలు ఉంటాయి. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి మంచి కొలువు దక్కుతుంది. మీ ఆఫీసులోనే ప్రేమ కనుగొంటారు. సహోద్యోగితో ప్రేమ తర్వాతి పరిణామాలను బేరీజు వేసుకోవాలి. ఖర్చులు పెరుగుతాయి. సంపాదన కూడా పెరుగుతుంది. చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు.
ధనుస్సు: ఆర్థిక పరిస్థితిలో కొన్ని హెచ్చు తగ్గులు ఉంటాయి. కానీ అది మిమ్మల్ని అడ్డుకోనివ్వకండి. విదేశాల్లో విద్య & ఉద్యోగాలు కోరుకునే అభ్యర్థులు మొదటి త్రైమాసికంలో విజయం సాధించవచ్చు. ఏడాది ప్రారంభంలో వ్యాపారంలో లాభాలు వస్తాయి. అవివాహితులు మే-జులై వరకు ఓపికగా వేచి చూడాలి. వివాహితులు కుటుంబంతో గడిపేందుకు సమయం వెచ్చించాలి. ఆచితూచి ఖర్చు చేయాలి. ఏడాది ద్వితీయార్థంలో అనారోగ్యం తలెత్తవచ్చు.
మకరం: ముందుగా మకర రాశికి కొన్ని శుభవార్తలు. మీకు ఏ విషయంలోనూ ప్రతికూలతలు అంతగా ఎదురు కావు. ఎంతో కాలంలో ప్రేమిస్తున్న తమ ప్రేమను వ్యక్తం చేయని వారు వేచి చూడొద్దు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో మీ ప్రేమను తెలియజేయండి. ఉద్యోగంలో ఆశించిన వృద్ధి ఉంటుంది. మొదటి 3 నెలలు ఆర్థికంగా బాగుంటాయి. తర్వాత కొంత ఇబ్బందులు ఉండొచ్చు. తిరిగి కోలుకుంటారు. పిల్లల ఆరోగ్యంపై ఎక్కువ దృష్టిసారించండి.
కుంభ: ఏ ఏడాది మీకు ప్రతికూలంగా ఉండొచ్చు. ఎలాంటి మార్పు అయినా ధైర్యంగా స్వీకరించగలగాలి. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారు 100 శాతం మెరుగైన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారం కూడా ఉత్తేజంగా ఉంటుంది. ఏడాది చివర్లో మీ భాగస్వామితో ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి. రెండో త్రైమాసికంలో పదోన్నతులు వస్తాయి. విద్య కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. వ్యక్తిగత, కుటుంబ ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.
మీనరాశి: ఇప్పటి వరకు ఎదురైన నిరుత్సాహ ఫలితాలు క్రమంగా తొలగిపోతాయి. ఓపికగా ఎదురు చూడాలి. కష్టకాలంలో మీ చుట్టు ఉండేవారి నిజస్వరూపం వెల్లడి అవుతుంది. ఈ ఏడాది ప్రేమ విషయంలో భాగస్వాములతో సంతోషంగా గడుపుతారు. అనవసర ఖర్చులు మాని, ప్రతి రూపాయి పొదుపు చేయడం ప్రారంభించండి. ఆర్థికంగా ఈ సంవత్సరం మీనరాశి వారికి బాగుంటుంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి.

సంబంధిత పోస్ట్