తేనెలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీఇన్‌ప్లెమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. చలికాలంలో తేనె తీసుకోవడం వల్ల రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. గాయాలు త్వరగా మానిపోతాయి. సీజనల్ వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. చర్మాన్ని మృదువుగా ఉండేలా చేస్తుంది. తేనెలో ఉండే గ్లూకోజ్‌లు శరీరానికి శక్తిని ఇస్తాయి. ఒత్తిడి, అలసటగా ఉంటే టీలో ఒక స్పూన్ తేనె కలిపి తాగితే ప్రయోజనం ఉంటుంది. పాలలో కలిపి తాగితే మంచి నిద్ర పడుతుంది.