కల్తీ నెయ్యి, నూనెలతో చేసిన పదార్థాలు తినడం వల్ల గుండె నాళాల్లో చెడు కొలెస్ట్రాల్ ఏర్పడి, హృద్రోగ ముప్పు పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. జంతువుల కొవ్వుతో తయారయ్యే నూనెల్లో 100 డిగ్రీల వద్ద వేడి చేసినా చనిపోని టేప్ వార్మ్, సిస్టోసర్కోసిస్ పరాన్నజీవులు ఉంటాయి. ఇవి శరీరంలోకి ప్రవేశించి మెదడు, కాలేయం, పేగులను దెబ్బతిస్తాయి. ఈ కల్తీ పదార్థాలతో ఉదర కోశ, పేగు క్యాన్సర్లు సైతం వచ్చే ప్రమాదముంది.