ప్రస్తుత కాలంలో చాలా మంది కంప్యూటర్, ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్‌లను ఎక్కువగా వాడుతున్నారు. ఈ క్రమంలో వారికి కంటి చూపు మందగిస్తుంది. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలను వాడితే కంటి సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. బాదం పప్పు తీసుకుంటే.. అందులో ఉండే విటమిన్ 'ఇ' కంటి చూపుకు మేలు చేస్తుంది. అలాగే ఉసిరి, క్యారెట్, నారింజ, బొప్పాయి, బ్రోకొలీ, చిలగడదుంప, గుడ్లు, ఆకుకూరలలో ఉండే విటమిన్ 'ఎ' కూడా కంటి చూపుకు దోహదపడుతుంది.