మొరం గుంతలో పడిన ఆటో.. మహిళ మృతి (వీడియో)

564చూసినవారు
TG: ఆదిలాబాద్ పట్టణ శివారులో ఆటో బోల్తా పడి మహిళ మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. గురువారం ఉదయం బంగారిగూడకు చెందిన పలువురు మహిళలు ఆటోలో పత్తి ఏరడానికి బయలుదేరారు. కాగా, డంపింగ్ యార్డ్ వద్ద మొరం కోసం తవ్విన గుంతలో ప్రమాదవశాత్తు ఆటో పడిపోవడంతో సవిత అనే మహిళ మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని ఆసుపత్రికి తరలించారని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్