మునగ కేఎం-3 రకాన్ని విత్తనాలతో సాగు చేయాలి. ఒక చెట్టుకు 400-500 కాయలు వస్తాయి. నాటిన ఆరు నెలలకే కాపుకొస్తుంది. పీకేఎం-1 రకం విత్తిన 7-8 నెలల్లో కోతకొస్తుంది. మార్చి-ఆగస్టు మధ్యలో దిగుబడి ఎకువగా ఉంటుంది. హెక్టారుకు 52 టన్నుల దిగుబడి ఉంటుంది. పీకేఎం-2 రకం విత్తనాల ద్వారా సాగు చేసుకోవాలి. నాటిన ఆరు నెలల్లో కాతకొస్తుంది. కాయలలో విత్తనాలు తకువ. కండ ఎకువగా ఉంటుంది. చెట్టుకు 220 కాయలు వస్తాయి.