హీరో అల్లు అర్జున్‌ను విచారించేది వీరే

53చూసినవారు
హీరో అల్లు  అర్జున్‌ను విచారించేది వీరే
TG: నటుడు అల్లు అర్జున్ కాసేపట్లో తన లీగల్ టీమ్ తో భేటీ కానున్నారు. అనంతరం వారితో కలిసి ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లనున్నారు. అల్లు  అర్జున్‌కు నిన్న పోలీసులు BNS 35(3) కింద నోటీసులిచ్చారు. సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి చిక్కడపల్లి ఏసీపీ రమేశ్, సీఐ రాజు ఆయన్ను ప్రశ్నించనున్నారు. తొక్కిసలాట కేసులో బన్నీ A11గా ఉండగా, నాలుగు వారాల వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్